'ఐటెం'సందడి చేస్తున్న ఛార్మి
ఒకవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే పెద్ద బానర్లు, హీరోల చిత్రాల్లో చార్మింగ్ లేడీ ఛార్మి ఐటెం సాంగ్స్ తో సందడి చేస్తోంది. బెల్లంకొండ సురేష్ 'భలే దొంగలు' చిత్రంలో ఇటీవల ఐటెం మెరుపులు సృష్టించిన ఛార్మి ఇప్పుడు రెండు పెద్ద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. వీటిలో హీరో శ్రీకాంత్ 100వ చిత్రమైన 'మహాత్మ' ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ను ఇటీవల అన్నపూర్ణా స్టూడియోస్ లో ఛార్మి-శ్రీకాంత్ లపై చిత్రీకరించారు. ఛార్మికి 'శ్రీ ఆంజనేయం' చిత్రంతో గ్లామర్ ఇమేజ్ తెచ్చిన క్రెడిట్ కృష్ణవంశీదే. దీనిని దృష్టిలో ఉంచుకునే కృష్ణవంశీ ఆఫర్ ను ఛార్మి అందిపుచ్చుకుందని అనుకోవచ్చు.
ఆసక్తికరంగా ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుర్స్' చిత్రంలోనూ ఛార్మి నటిస్తోంది. ఎన్టీఆర్ తో 'రాఖీ ' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన ఛార్మి ఈసారి మాత్రం ఆయనతో కలిసి ఓ ఐటెం సాంగ్ లో నర్తించనుంది. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వంశీమోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. కాగా, కృష్ణవంశీ 'మహాత్మ' అక్టోబర్ 2న విడుదలవుతుంది.
Be first to comment on this News / Article!
|