'మర్యాద రామన్న' సెట్స్ కు...
ఈమధ్యనే 'మగధీర' వంటి సెన్సేషన్ హిట్ ను అందించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు 'మర్యాద రామన్న' చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నద్ధమవుతున్నారు. 'అందాలరాముడు' తర్వాత కమెడియన్ సునీల్ కథానాయకుడుగా నటిస్తున్న రెండో చిత్రమిది. ఆర్క మీడియో వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనునారు. మే 5న పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ చిత్రం ఈనెల 3వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ లోకి అడుగుపెట్టనుంది.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉండబోతోంది. ఫ్యాక్షన్ నాయకుల 'మానవతావాదం' అనే కోణంలో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. సునీల్ కు జోడిగా సలోని నటించనుంది. బ్రహ్మానందం మరో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రానికి తొలుత సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె.నాయుడును ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆయన బిజీగా ఉండటం వల్ల శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. విజయేంద్ర ప్రసాద్ శిష్యుడు కాంచి ఈ చిత్రానికి కథ అందిస్తుండగా, రవీందర్ కళాదర్శకత్వం, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్, రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనింగ్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|