చికాగోలో 'జోష్' యూత్ రాక్
నాగచైతన్య కథానాయకుడుగా వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'జోష్' చిత్రం చికాగాలో యూత్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆ చిత్రం చికాగో డిస్ట్రిబ్యూటర్స్ తెలియజేశారు. బిగ్ సినిమాలో ఈనెల 4న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి వెబ్ సమీక్షల్లో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, చికాగో మూవీ లవర్స్ మాత్రం నవ యువసామ్రాట్ అక్కినేని నాగగచైతన్యను వెండితెరపై చూసేందుకు తహతహలాడారనీ, ఇందుకు వీలుగా శుక్రవారం నుంచి సోమవారం వరకూ 30 షోలు ప్రదర్శించామనీ వారు తెలిపారు. సుమారు 1560 టిక్కెట్లు అమ్ముడుపోయాయనీ, ముఖ్యంగా యూత్ నుంచి ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తోందనీ చెప్పారు.
'జోష్' చిత్రంలో స్టూడెంట్స్ సైకాలజీని ఎంతో బాగా ప్రెజెంట్ చేశారనీ, ఎక్కువ మంది కొత్తవారే ఇందులో నటించడంతో ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుందనీ వారు చెప్పారు. నాగచైతన్య కు ఇది తొలి చిత్రమే అయినా ఫైట్స్, సంభాషణలు పలకడం, ఎమోషనల్స్ సీన్స్ లో చక్కగా రాణించారనీ, ఎంతో స్టైలిష్ గా కనిపించారనీ అన్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నేటి విద్యా విధానంపై డయాస్ మీద నాగచైతన్య స్పీచ్ ఇచ్చే సన్నివేశం ఎంతో బాగా రక్తికట్టిందన్నారు. చిన్నారులతో కార్తిక నటించిన ఎపిసోడ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయనీ, సినిమా చివర్లోనే ఆమె క్యారెక్టర్ పేరు వస్తుందని అన్నారు. కార్తీకను కాలేజీ స్టూడెంట్ గా సునీల్ పరిచయం చేసినప్పుడు ఆమె ఎంతో సంబరంతో సునీల్ కు జ్యూస్ ఇచ్చే సన్నివేశం బాగా పండిందనీ, తన తల్లి రాధ నుంచి సంక్రమించిన సహజనటనతో కార్తిక అలరించిందనీ వారన్నారు. కాలేజీలో జరిగే సంఘటనల గురించి అదే కాలేజీ గోడల మీద కూర్చుని సంభాషించుకునే విద్యార్థుల ఎపిసోడ్స్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు చెప్పారు. అలాగే నాగచైతన్య ఎంతో కాన్ఫిడెన్స్ తో చెప్పిన 'చెప్పింది వినేవాడు స్టూడెంట్ కాదు', 'నాకు మామూలుగా మెసేజ్ లు ఇవ్వడం ఇష్టం ఉండదు రా...నీకు ఏమైనా ఇచ్చాను అనిపిస్తే తీసుకే' వంటి సంభాషణలకు మంచి రెస్పాన్ వస్తోందన్నారు. 'కాలేజీ పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం చెబుతుంది...గుణపాఠం' (ప్రకాష్ రాజ్), 'పక్కనున్నోడు ఏ పార్టీయో ముందు తెలుసుకోవాలి' (బ్రహ్మానందం) వంటి సంభాషణలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఓవరాల్ గా నాగచైతన్య 'జోష్' చిత్రం యూత్ ను ఓ ఊపు ఊపుతోందనీ, రాకింగ్ రెస్పాన్స్ వస్తోందనీ చికాగో డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేశారు.
For Josh Tickets contact: www.chicagotelugu.com
Be first to comment on this News / Article!
|