'యంగ్ ఇండియా' రికార్డింగ్
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వం వహించనున్న 149వ చిత్రం 'యంగ్ ఇండియా'. శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా పతాకంపా రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం నూతన నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రారంభమైంది.
నిర్మాత రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఈనెల 20వ తేదీ వరకూ రికార్డింగ్ జరుగుతుందనీ, ఇందులో మొత్తం 6 పాటలు ఉన్నాయనీ తెలిపారు. దాసరి, సంగీత దర్శకుడు కీరవాణి కలయికలో గతంలో కొన్ని చిత్రాలు వచ్చాయనీ, కొంత గ్యాప్ తర్వాత వారిద్దరి కలయికలో ఈ చిత్రం రూపొందుతోందనీ చెప్పారు. నూతన తారల ఎంపిక కూడా ఈ గురువారం నుంచే మొదలైందనీ, రోజుకు 25 మందిని ఇంటర్వ్యూ చేసి ఆయా పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేస్తామనీ ఆయన తెలిపారు.
Be first to comment on this News / Article!
|