'రామ్ దేవ్' సాంగ్స్
అబ్బాస్, ఆకాష్, సాయికిరణ్, గ్రేసిసింగ్, అర్చన్ ముఖ్య పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'రామ్ దేవ్'. ఎస్.కె.బషీద్ దర్శకత్వంలో ఎస్.కె.కరీమున్నిసా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం రావినారాయణ రెడ్డి ఆడిటోరియలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఆడియో సీడీని సి.కల్యాణ్ ఆవిష్కరించి తొలి ప్రతిని బి.గోపాల్ కు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను బి.గోపాల్ విడుదల చేసి సి.కల్యాణ్ కు అందించారు. సాగర్, పరుచూరి గోపాలకృష్ణ, ఆకాష్, అబ్బాస్, సాయికిరణ్, గ్రేసీసింగ్, కవిత, విజయశ్రీ, శ్రీలేఖ, బషీద్ తదితరులు హాజరయ్యారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
అబ్బాస్ మాట్లాడుతూ, కొద్ది గ్యాప్ తర్వాత తెలుగులో తాను నటించిన చిత్రమిదనీ, దర్శకుడు చాలా బాగా సినిమా తీశాడనీ, సంగీతం బాగా కుదిరిందనీ అన్నారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. తన సినీ కెరీర్ లో ఇది ఒక మంచి చిత్రమవుతుందని ఆకాష్ పేర్కొన్నారు. బషీద్ గారు ఈ చిత్రంలో పాత్ర కోసం పిలిచినప్పుడు ఏ దేవుడి పాత్రో ఇస్తారనుకున్నాననీ, అయితే తనకు మంచి విలనీ పాత్ర దక్కిందనీ అన్నారు. తన కెరీర్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. దర్శకుడిగా తనకు ఈ చిత్రం మంచిపేరు తెస్తుందని ఆశిస్తున్నాననీ, శ్రీలేఖ మంచి సంగీతం అందించిందనీ బషీద్ అన్నారు. ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు గ్రేసీసింగ్, అర్చన పేర్కొన్నారు. చిత్ర యూనిట్ కు పరుచూరి గోపాలకృష్ణ అభినందనలు తెలిపారు.
Be first to comment on this News / Article!
|