'క్విక్ గన్ మురుగన్'కు సీక్వెల్
హాస్య నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ నటించిన 'క్విక్ గన్ మురుగన్' చిత్రం తెలుగులో మినహా ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఆదరణ చూరగొంటోంది. శాశాంక్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ పిక్చర్స్ గత నెల 28న విడుదల చేసింది. రాజేంద్ర ప్రసాద్, దక్షిణాది గ్లామర్ బ్యూటీ రంభ, ప్రముఖ నటుడు నాజర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తెలుగు నుంచి బయ్యర్లు రాకపోవడంతో విడుదలలో జాప్యం జరిగిందనీ, ఇప్పుడు సినిమాకి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా బయ్యర్లు ఉత్సాహం చూపుచుతున్నారనీ చెబుతున్నారు. ఈ నెలలోనే 'క్విక్ గన్..' చిత్రాన్ని ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ఆంధ్రరాష్ట్రమంతటా విడుదల చేసేందుకు ఫాక్స్ స్టార్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఆసక్తికరంగా ప్రపంచ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు కూడా ఇప్పుడు సదరు చిత్ర నిర్మాణ సంస్థ, దర్శకుడు శశాంక్ ఘోష్ ప్లాన్ చేస్తున్నారు.
అమెరికా బ్యాక్ డ్రాప్ లో సీక్వెల్ ఉంటుందనీ, దీనికి 'షూటవుట్ ఎట్ టైమ్ స్క్వేర్' అనే టైటిల్ ను అనుకుంటున్నామనీ శశాంక్ ఘోష్ ధ్రువీకరించారు. తొలి వెర్షన్ లో చేసిన నటీనటులే ఇందులోనూ కంటిన్యూ అవుతారనీ, మూడు నాలుగు వారాల పాటు సక్సెస్ ను ఎంజాయ్ చేసిన తర్వాతే సీక్వెల్ పనులకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నామనీ దర్శకుడు ప్రకటించారు.
Be first to comment on this News / Article!
|