సెంచరీకి రెండు తక్కువ
ఇవాల్టి యువహీరోలు ఏడాదికి ఒక సినిమాకే పరిమితమవుతున్న నేపత్యంలో నిన్నటితరం హీరోగా ప్రేక్షకుల అభిమానం చూరగొన్న హీరో శ్రీకాంత్ సెంచరీ మార్క్ చేరుకున్నారు. ఆయన 100వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'మహాత్మ' అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఆసక్తికరంగా శ్రీకాంత్ కు ఇది 100వ చిత్రమే అయినా..విడుదలవుతున్న 98వ చిత్రమే అవుతుంది.
శ్రీకాంత్-సదా జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 98వ చిత్రంగా 'ఆ ఆ ఇ ఈ' (అతను ఆమె ఇతడు ఈమె) చిత్రం కొద్దికాలం క్రితమే నిర్మాణపూర్తి చేసుకుంది. అయితే కారణాంతరాల వల్ల ఆ చిత్ర ఇంతవరకూ విడుదలకు నోచుకోకుండా జాప్యం జరుగుతోంది. ఎప్పటికప్పుడు త్వరలో రిలీజ్ చేస్తామంటున్న ఈ చిత్రం ఇంకా విడుదల తేదీని మాత్రం ఖరారు చేసుకోలేకపోయింది. సెంచరీ మార్క్ కు మరొక్కటే తక్కువగా ఉండటంతో ఈమధ్య శ్రీకాంత్, శ్రీహరి కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ చిత్రం జాడ లేదు. ప్రోగ్రస్ కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో 98, 99వ చిత్రాల కంటే ముందే శ్రీకాంత్ 100వ చిత్రంగా ప్రచారానికి నోచుకున్న 'మహాత్మ' రెడీ అవుతోంది. ముందువెనుకల మాటెలా ఉన్నా సెంచరీ కొట్టిన హీరోల జాబితాలో శ్రీకాంత్ చేరిపోయారు.
Be first to comment on this News / Article!
|