వైఎస్ కు సినీప్రముఖుల నివాళి
స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అకాలమృతికి ఫిలిం క్రిటిక్స్ వర్కర్స్ అసోసియేషన్ నివాళులర్పించింది. ఆంధ్రప్రదేశ్ సినీ కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ (చిత్రపురి) కాలనీలో ఈ సంతాప సభ నిర్వహించారు. శునివారం ఉదయం జరిగిన ఈ సంతాప సభలో సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డి, దర్శకరత్న దాసరి నారాయణ రావు, డాక్టర్ డి.రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ, మురళీమోహన్, కోటగిరి వెంకటేశ్వరరావు తదితర సినీ ప్రముఖులు పాల్గొని వై.ఎస్.కు ఘన నివాళులు అర్పించారు.
ఆంధ్రుల ప్రియతమ నేత వై.ఎస్. అకాల మృతి సినీ పరిశ్రమకు సైతం తీరని లోటనీ, పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమనీ సినీ ప్రముఖులు వై.ఎస్.ను కొనియాడారు. వై.ఎస్. మృతికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Be first to comment on this News / Article!
|