గెద్దాడ ఆనందబాబు మృతి
సీనియర్ నిర్మాత, దర్శకుడు గెద్దాడ ఆనందబాబు హైద్రాబాద్ లో శనివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 50 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నాయి.
రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆనందబాబు 'శ్రీదేవి నర్సింగ్ హోం', 'కార్తీక మాసం', 'నా పెళ్లాం నా ఇష్టం', 'హరహర శంభో' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన 'చమ్మచెక్క చారెడేసి మొగ్గ' చిత్రం విడుదల కావలసి ఉంది. ఆనంద్ బాబు మృతిపట్ల నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Be first to comment on this News / Article!
|