చెన్నైలో ముగిసిన 'హైస్కూలు'
కిరణ్ రాథోడ్, మాస్టర్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా రొమాన్స్, సెంటిమెంట్, కామెడీ వంటి అంశాలను మేళవించి రూపొందుతున్న చిత్రం 'హైస్కూలు'. ఐశ్వర్య ఫిలింస్ పతాకంపై నరసింహ నంది దర్శకత్వంలో మల్లన్న నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. చెన్నైలో ఇటీవల 10 రోజుల పాటు వివిధ లొకేష్లలో ఒక పాట, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామనీ, దీంతో షూటింగ్ పూర్తయిందనీ నరసింహ నంది తెలిపారు.
పదమూడేళ్ల అబ్బాయికీ, ముఫ్పై ఏళ్ల అమ్మాయికీ మధ్య సాగే ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తమని ఆయన తెలిపారు. నిర్మాత మల్లన్న మాట్లాడుతూ, అనుకున్న ప్రకారం చెన్నై షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయిందనీ, దర్శకుడు చక్కటి క్వాలిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ చెప్పారు. నిర్మాణాంతర కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు, రజిత, తిలక్, జెన్నీ, గౌతంరాజు, మల్లిక తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం నరసింహ నంది అందించిన ఈ చిత్రానికి కల్యాణ్ సినిమాటోగ్రఫీ, సాకేత్ సాయిరామ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|