శర్వానంద్ 'అందరి బంధువయ'
శర్వానంద్, పద్మప్రియ జంటగా ఫిల్మోత్సవ్ పతాకంపై యుటోపియా ఎంటర్ టైనర్స్ పతాకంపై చంద్రసిద్ధార్ధ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి 'అందరి బంధువయ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం ఇంతవరకూ 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
చంద్రసిద్ధార్ధ ఆ విశేషాలను తెలియజేస్తూ, పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందన్నారు. అలాగని కేవలం రొమాంటిక్ యాంగిల్ ఒక్కటే కాకుండా యూనివర్శల్ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. అన్ని తరహాల అనుబంధాలను చర్చిస్తూ రూపొందించిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఇదని అన్నారు. మంచి హ్యూమర్ కూడా ఉంటుందని చెప్పారు. కథకు అనుగుణంగానే ఈ టైటిల్ ను నిర్ణయించామని తెలిపారు. ఈ నెలాఖరుతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నరేష్, కృష్ణ భగవాన్, ఆర్.కె., ఎం.ఎస్.నారాయణ, విజయ్, ఆర్యన్ తదితరులు నటిస్తున్నారు. బలభద్రపాత్రుని రమణి కథ-మాటలు, చెతన్యప్రసాద్ పాటలు, జయకృష్ణ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|