వంశీ అల్లరి...
గోదావరి అందాలను తెరకెక్కించడంలోనూ, హాస్య పాత్రలను సృష్టించడంలోనూ దర్శకుడు వంశీకి ప్రత్యేక మైన స్టైల్ ఉంది. కామెడీ హీరోగా తెరనిండా తనదైన అల్లరితో హాస్యం పడించడంలో అల్లరి నరేష్ సైతం ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. తొలిసారి వంశీ-అల్లరి నరేష్ కాంబినేషన్ లో ఓ చిత్రానికి ప్లానింగ్ జరుగుతోంది. కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత పద్మ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
వంశీ దర్శకత్వం వహించిన 'గోపి గోపిక గోదావరి' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఓ మోస్తరుగా ఉందనే ప్రచారం జరిగినా కమర్షియల్ గా సినిమా సక్సెస్ అయింది. ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకుని పలు థియేటర్లలో రన్ అవుతోంది. ఈ చిత్రం ఇచ్చిన కిక్ తో వంశీ తన తదుపరి చిత్రానికి అల్లరి నరేష్ ను ఎంచుకుని స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. నవంబర్ నుంచి ఈ చిత్రం తెరకెక్కనుంది. అల్లరి నరేష్ సైతం ప్రస్తుతం ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో సురేష్ బ్యానర్ లో డి.రామానాయుడు నిర్మిస్తున్న 'బెండు అప్పారావు ఆర్ఎంపి', బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'శంభో శివ శంభో' చిత్రాల్లో నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|