'అద్భుతవైద్యం ఆయుర్వేదం'
ఆయుర్వేదం విలువ నేటి తరానికి తెలియజెప్పే ఇతివృత్తంతో 'అద్భుత వైద్యం ఆయుర్వేదం' అనే చిత్రం తెరకెక్కుతోంది. కె.పి.లక్ష్మణాచారి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. ధన్వంతరి క్రియేషన్స్ పతాకంపై పార్వతమ్మ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. శాంతి, సోనియా, అభినయశ్రీ ప్రధాన పాత్రధారులు. శ్రీపాద రామచంద్రరావు దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లో ఆదివారంనాడు జరిగింది. ఎస్.కె.బాష సంగీతం అందించిన ఆడియో సీడీని సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు ఆవిష్కరించి చిత్ర సమర్పకురాలు కె.పార్వతమ్మకు అందజేశారు. మైత్రి ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి.
ఆయుర్వేదం శక్తి తెలియజేయడానికి ఓ యువకుడు పడిన తపనే ఈ చిత్రం కథ అనీ, అన్నివర్గాల వారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ శ్రీపాద రామచంద్రరావు తెలిపారు. ఇందులో ఐదు పాటలు ఉంటాయని సంగీత దర్శకుడు బాష తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలోనే సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
Be first to comment on this News / Article!
|