నాగార్జున సరసన మమత
'కింగ్' చిత్రం తర్వాత నాగార్జున కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా మమతా మోహన్ దాస్ ఎంపికైంది. ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడుగా పరిచయవవుతున్నారు. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ చివరకు మమతా మోహన్ దాస్ నే ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
నాగార్జున ఇంతవరకూ చేయని వైవిధ్యమైన పాత్రను ఇందులో పోషిస్తున్నారనీ, మమతా మోహన్ దాస్ ను హీరోయిన్ గా ఎంపిక చేశామనీ ఆయన అన్నారు. అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయనీ, ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుగుతోందనీ చెప్పారు. కంటిన్యుయస్ షెడ్యూల్ తో నవంబర్ కల్లా షూటింగ్ పూర్తవుతుందనీ, డిసెంబర్ లో రిలీజ్ ఉంటుదనీ తెలిపారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం కిరణ్ అందిస్తున్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, సందీత్ చౌతా సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|