తెలుగులో 'కాదల్ కథై'
తమిళంలో వేలు ప్రభాకరన్ దర్శకత్వం వహించిన 'కాదల్ కథై' చిత్రం రీమేక్ హక్కులను వి.సురేష్ సౌదరి దక్కించుకున్నారు. సూర్య పవర్ ఫుల్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని ఆయన తెలుగులోకి అనువదించి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సురేష్ చౌదరి ఆ వివరాలు తెలియజేస్తూ, సరికొత్త ప్రేమకథ, కొత్త నటీనటులతో తమిళంలో రూపొందించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిందని చెప్పారు. ఈ చిత్రం రైట్స్ కోసం పలువురు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ తనకు అనువాద హక్కులు దక్కాయని చెప్పారు. ఇంతవరకూ ఎన్నో కథా చిత్రాలు వచ్చాయనీ, కొత్త పాయింట్ తో వచ్చిన ప్రతి ప్రేమకథా ప్రేక్షకుల ఆదరణ చూరగొందనీ అన్నారు. వేలు ప్రభాకరన్ అంతా కొత్తవాళ్లతో ప్రయోగాత్మక చిత్రంగా దీన్ని మలిచారనీ, తమిళ ప్రేక్షకులు మెచ్చి హిట్ చేశారనీ అన్నారు. ఇటీవల ఈ చిత్రం కేరళలో కూడా మంచి విజయం సాధించిందనీ, తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా చూరగొంటుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. అందరూ మెచ్చే చిత్రంగానే కాకుండా ఆలోచింపజేసే చిత్రమిదని, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామనీ తెలిపారు.
అతి రూపన్, ప్రీతి రంగయాని జంటగా నటించిన ఈ చిత్రంలో బాబిలోనీ, స్టెఫి తదితరులు నటించారు. రాజశేఖర్ రెడ్డి సంభాషణలు, పొందూరి పాటలు, మధు ఎడిటింగ్ అందిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|