'అలివేలు మంగ'గా భూమిక
'మిస్సమ్మ', 'అనసూయ', 'మల్లెపూవు' వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అందాల నటి భూమికి ఇప్పుడు 'అలివేలు మంగ' అవతారం ఎత్తబోతోంది. 'కేక' సినిమా తర్వాత సైలెంట్ అయిపోయిన దర్శకుడు తేజ ఇటీవలనే మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఇంతవరకూ చిత్రం మూవీస్ బ్యానర్ పై పలు చిత్రాలను కూడా నిర్మించిన తేజ ఇక నుంచి పూర్తి స్థాయి నిర్మాతగా మారుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. 'జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్' అనే కొత్త బ్యానర్ ను కూడా ఏర్పాటు చేసి ఈ బ్యానర్ పై కార్పొరేట్ స్థాయిలో యుద్ధప్రాతిపదికన 50 చిత్రాల నిర్మించనున్నట్టు తెలిపారు. తొలి చిత్రంగా 'అలవేలు మంగ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. కోడిరామకృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా భూమిక ఎంపికైంది మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది.
'ప్రతిఘటన', 'అంకుశం' తరహాలో ఈ చిత్రం ఉంటుందనీ, ఇదే నెలాఖరులో షూటింగ్ ప్రారంభమవుతుందని తేజ తెలిపారు. ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతం అందించనున్నారు. మరోవైపు భూమిక కథానాయికగా నటించిన 'యాగం' విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికితోడు తన సొంత సంస్థ అయిన డౌన్ టౌన్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న 'తకిట తకిట' చిత్రంలోనూ భూమిక నటిస్తోంది.
Be first to comment on this News / Article!
|