'మహాత్మ' గీతాలు 19న
ఒక సామాన్యయువకుడు 'మహాత్మ' ఎలా అయ్యాడన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'మహాత్మ'. శ్రీకాంత్ నటిస్తున్న 100వ చిత్రమిది. 'ఖడ్గం' చిత్రంతో శ్రీకాంత్ కు మాస్ ఫాలోయింగ్ తెచ్చిన కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గెల్డెన్ లయైన్స్ పతాకంపై సి.ఆర్.మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భావన కథానాయిక. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
దేశానికి స్వాంతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటిందనీ, వాడవాడలా గాంధీ విగ్రహాలు వెలిసినప్పటికీ ఆయన ఆశయాలు ఏమేరకు అమలవుతున్నాయనేది ఈ చిత్రంలో చర్చించామనీ కృష్ణవంశీ తెలిపారు. హింసతోనే ఏదైనా సాధించవచ్చని నమ్మే కథానాయకుడు ఒక సందర్భంలో అహింసా మంత్రాన్ని జపిస్తాడనీ, అతనిలో ఆ మార్పునకు కారణం, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవించాయనేది ఈ చిత్ర ఇతివృత్తమని చెప్పారు. శ్రీకాంత్, కృష్ణవంశీ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలనే తన కోరిక ఈ చిత్రంతో తీరిందనీ, శ్రీకాంత్ నటన, కృష్ణవంశీ దర్శక ప్రతిభ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందనీ నిర్మాత మనోహర్ చెప్పారు. ఛార్మి ఓ ప్రత్యేక గీతంలో నర్తించిందని తెలిపారు. ఈనెల 19న ఆడియో విడుదల చేసి గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి పరుచూరి సోదరులు రచన, సిరివెన్నెల-సుద్దాల అశోక్ తేజ-లక్ష్మీభూపాల్ పాటలు, శరత్ సినిమాటోగ్రఫీ, శంకర్ ఎడిటింగ్, విజయ్ ఆంటోని సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|