స్పీడ్ గా మహేష్ శ్రీను..
ప్రిన్స్ మహేష్ బాబు 'అతిథి' తర్వాత మళ్లీ ఇంతవరకూ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కారణాంతరాల వల్ల మహేష్-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రం ఆలస్యంగా మొదలై ఇప్పుడిప్పుడే రెగ్యులర్ షెడ్యూల్ జరుపుకొంటోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ పూర్తవుతుందనీ, 2010 సంక్రాంతి పండుగకు రిలీజ్ ఉంటుందనీ తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది కూడా మహేష్ ను తెరపై చూడాలనే అభిమానుల కోరిక తీరక పోవచ్చు. అయితే వచ్చే ఏడాది మాత్రం మహేష్ మరో కొత్త సినిమాతో కూడా ప్రేక్షకాభిమానులను అలరించబోతున్నారు.
యాక్షన్ తో కూడిన వినోదాత్మక చిత్రాలతో వరుస హిట్లు సాధిస్తున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు తదుపరి చిత్రం ఉండబోతోంది. ప్రస్తుతం వెంకటేష్ తో 'ఓం నమో వెంకటేశ' చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత మహేష్ తో శ్రీనువైట్ల చిత్రం ఉండబోతోంది. ఈ చిత్రాన్ని ఇందిర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ సోదరి మంజుల నిర్మించబోతున్నారు. ప్రస్తుతం మంజలు సైతం నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా, మంజుల-మహేష్-శ్రీనువైట్ల కాంబినేషన్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలవుతుందనీ, ద్వితీయార్థానికి రెడీ చేస్తారనీ తెలుస్తోంది. ఏడాదికి రెండు సినిమాల ప్లానింగ్ మహేష్ విషయంలో వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంద్నమాట. ప్రిన్స్ అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ కిందే లెక్క...
Be first to comment on this News / Article!
|