వంధ్యత్వంపై నటి పోరు!
పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు లైంగిక సామర్థ్యం పరీక్షలు జరిపించుకోవాలనే చట్టం తీసుకురావాలంటూ సహస్రాధిక చిత్రాల నటి మనోరమ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వధువు వివాహానికి ముందు మెడికల్ సర్టిఫెకెట్లు చూపించాలనీ, వరుడు లైంగిక సామర్థ్యం ఉన్నవాడిగా, హెచ్ఐవి లేనివాడిగా నిర్ధారణ పత్రం ఉండాలనీ మనోరమ అభిప్రాయపడుతున్నాడు. తన ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని ఓ చట్టం తీసుకురావాలంటూ ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిని, డిప్యూటీ సిఎం స్టాలిన్ నూ, ఆరోగ్య మంత్రి ఎంఆర్ కు పన్నీర్ సెల్వంను కలుసుకుని విన్నవించారు.
దీనిపై మనోరమ వివరణ ఇస్తూ, వంధ్యత్వం, ఎచ్ఐవి ఉన్న పురుషుల నుంచి మహిళలను పరిరక్షించేందుకు త్వరలోనే తాను ఓ ఉద్యమం చేపట్టనున్నాననీ, ఈ దిశగా ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తమిళనాట ఉద్యమాన్ని చేపట్టనున్నాననీ చెప్పారు. తాను చేపట్టే ప్రచార ఉద్యమానికి సంతకాల సేకరణ కూడా చేపట్టే ఆలోచన ఉందన్నారు. అయితే వ్యక్తిగత లోపాలు, స్వలింగ సంపర్కంపై ఆసక్తి ఉండటం వంటివి అంత తేలిగ్గా నిర్దారించడం కష్టమనీ, జనాల్లో చైతన్యం తీసుకురావడం మాత్రం మంచిదేననీ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా...పెళ్లికి ముందే లైంగిక సంబంధం తప్పుకాదంటూ ఆమధ్య నటి కుష్బూ సంచలనం సృష్టిస్తే, పెళ్లి కావాల్సిన జంటలు ముందుగా తమ ఫిటినెస్ నిరూపించుకోవాల్సిందేనంటూ మనోరమ మరో కొత్త చర్చకు తెరతీశారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|