జగపతి-ప్రియమణి హ్యాట్రిక్
'పెళ్లైన కొత్తలో' చిత్రంతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న జగపతిబాబు, ప్రియమణి ప్రస్తుతం మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ప్రవరాఖ్యుడు' కోసం రెండోసారి కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ జంట హ్యాట్రిక్ కూడా కొట్టబోతోంది. జగపతిబాబు, ప్రియమణి హీరోహీరోయిన్లుగా కుమార్ బ్రదర్శ్ సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ ఓ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరచయమవుతున్నారు.
చిత్ర విశేషాలను కుమార్ బ్రదర్స్ వివరిస్తూ, ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుందనీ, జగపతిబాబు, ప్రియమణి పాత్రలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయనీ చెప్పారు. పూర్తి కొత్తదనంతో, అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయన్నారు. ఈ నెలలోనే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, నాజర్, సుధ, ప్రగతి, సత్యం రాజేష్, యు.పి.రాజు, సుప్రీత్ తదితరులు నటించనున్నారు. సాంకేతిక నిపుణుల వివారాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|