'అమరావతి'లో త్రీ రోజెస్!
'అల్లరి' చిత్రంతో తొలిసారిగా డైరెక్టర్స్ క్యాప్ పెట్టుకున్న రవిబాబు ఆ చిత్రం విజయం తర్వాత అల్లరి రవిబాబుగా పాపులర్ అయ్యారు. అడ్వాన్స్డ్ థాట్స్ తో సినిమాలు తీయడంలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను ఆయన నిరూపించుకుంటున్నారు. భూమికతో 'అనసూయ' వంటి థ్రిల్లర్ తీసిన రవిబాబు ఈమధ్యనే 'నచ్చావులే' వంటి యూత్ ఎంటర్ టైనర్ ను అందించి వరుస సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సస్పెన్స్, థ్లిల్లర్ కథాశంతో 'అమరావతి' అనే చిత్రా్ని తనదైన స్టయిలిష్ టేకింగ్ తో తెరకెస్తున్నారు. ఇందులో అందాల భామలు భూమిక, స్నేహ కథానాయికలు. మరో బ్యూటీ కూడా ఉందని సమాచారం. రసూల్ ఎల్లోర్ 'సంగమం' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన సింధూర గద్దె సైతం ఇందులో కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోందని తెలుస్తోంది. అంటే ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే భూమిక, స్నేహలలో 'అమరావతి' ఎవరనేది రవిబాబు సస్పెన్స్ గానే ఉంచుతున్నారు.
భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 'శౌర్యం' చిత్రాన్ని నిర్మించిన వి.ఆనంద్ ప్రసాద్ 'అమరావతి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో కళాదర్శకుడు నారాయణ రెడ్డి వేసిన భారీ సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రవిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తారకరత్న నెగిటివ్ క్యారెక్టర్ పోషిస్తున్నట్టు సమాచారం. ఇంతవరకూ 75 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ మొదటివారానికి షూటింగ్ పూర్తి చేసి, అదే నెలాఖరులో సినిమా విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది. పాటలు లేని ఈ చిత్రానికి సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|