రవితేజ 'ఫ్యాషన్ డిజైనర్'
యాక్షన్ తో కూడిన కామెడీ ఎంటర్ టైనర్లు అందిస్తున్న రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ వంశీ కాంబినేషన్ చిత్రానికి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. గతంలో వంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడుగా సంచలన విజయం సాధించిన 'లేడీస్ టైలర్' చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే పేరును కూడా ఖరారు చేశారు.
చాలాకాలంగా 'లేడీస్ టైలర్' సీక్వెల్ ఆలోచన వంశీకి ఉన్నప్పటికీ కారణాంతరాల వల్ల అది కార్యరూపంలోకి రాలేదు. ఇటీవల రెండు మూడు ఫెయిల్యూర్స్ చవిచూసిన వంశీ సైతం ఇప్పుడు 'గోపి గోపిక గోదావరి'తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. ఈ చిత్రానికి తొలుత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ చక్కటి ప్రమోషన్ వర్క్ తో సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లగలిగారు. దీంతో ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ ను అందిపుచ్చుకుంది. 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రం తర్వాత రవితేజ-కృష్ణవంశీ కాంబినేషన్ లో రానున్న 'ఫ్యాషన్ డిజైనర్' చిత్రాన్ని నల్లం శ్రీనివాస్, సదాశివుని రవి, ఎం.ఎల్.కుమార్ చౌదరి కలిసి నిర్మించనున్నారు. 'లేడీస్ టైలర్' చిత్రానికి సంభాషణలు అందించిన సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఈ సీక్వెల్ కు సైతం సంభాషణలు అందించనుండటం విశేషం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం నవంబర్ నుంచి సెట్స్ పైకి రానుంది. రవితేజ ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ నిర్మాతగా తమిళ 'నానోడిగల్' రీమేక్ లో నటిస్తున్నారు. తదుపరి చిత్రం వంశీతోనే ఉండబోతోంది.
Be first to comment on this News / Article!
|