సంక్రాంతికి ప్రభాస్ 'డార్లింగ్'
'బిల్లా' వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత హీరో ప్రభాస్ 'ఏక్ నిరంజన్'గా ప్రేక్షకుల అలరించేందుకు అక్టోబర్ 29న వస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండానే తన తదపురి చిత్రమైన 'డార్లింగ్'కు సైతం రెడీ అవుతున్నారు. ప్రభాస్ తో 'ఛత్రపతి' వంటి సెన్సేషన్ హిట్ ను అందించిన బివిఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించనున్నారు. కరుణాకరన్ దర్శకుడు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేస్తున్నారు.
'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రం తర్వాత కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కంచనున్నారు. ప్రభాస్ ను కొత్త కోణంలో ప్రెజెంట్ చేయనున్నారు. ప్రభాస్ కు జోడిగా కాజల్, ఓ ప్రత్యేక పాత్రలో తమిళ నటుడు ప్రభు నటించనున్నారు. స్విట్జర్లాండ్ తో పాటల చిత్రీకరణతో అక్టోబర్ లో షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ చిత్రాన్ని రెడీ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆండ్రూస్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, ఎ.ఆర్.రెహ్మాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|