కోల్ కతా లో ఎన్టీఆర్ 'అదుర్స్'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుర్స్' చిత్రం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. వైష్ణవీ ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కంత్రీ' తర్వాత ఎన్టీఆర్ చిత్రం ఏదీ ప్రేక్షకుల ముందుకు రాకపోవడం, 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత ఎన్టీఆర్-వినాయక్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతుండటంతో సహజంగా మంచి అంచనాలు నెలకొన్నారు. ప్రస్తుతం కోల్ కతాలో చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది.
కోల్ కతాలో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్ లో ఈనెల 22వ తేదీ వరకూ షూటింగ్ జరుగనుంది. దీంతో మూడొంతులు షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇందులో బ్రాహ్మణ యువకుడుగా పర్ ఫార్మెన్స్ అదరగొడతాడనీ, రెండో గెటప్ లో ఎన్టీఆర్ గ్లామర్ గా కనిపిస్తారనీ తెలుస్తోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన స్టిల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు, ఎన్టీఆర్ సరనన నయనతార, షీలా హీరోయిన్లు కాగా, మహేష్ మంజ్రేకర్ విలన్ పాత్ర పోషించనున్నారు. ఛార్మి ఓ స్పెషల్ సాంగ్ లో నరిస్తోంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 14న సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతుండగా, డిసెంబర్ లో విడుద చేయాలనేది ఇప్పటి ప్రపోజల్ అనీ, ఇందువల్ల సంక్రాంతి సీజన్ కూడా టార్గెట్ అవుతుందని దర్శకనిర్మాతల ప్లానింగ్ అనీ తెలుస్తోంది. ఎన్టీఆర్ సైతం 'కంత్రి' తర్వాత వచ్చిన గ్యాప్ ను దృష్టిలో పెట్టుకుని మరో రెండు కొత్త ప్రాజెక్ట్ లకు కమిట్ అయ్యారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న 'బృందావనం' (గోవిందుడు అందరి వాడేలే) చిత్రం అక్టోబర్ లో సెట్స్ మీదకు రానుండగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించనున్న చిత్రం
డిసెంబర్ నుంచి ప్రోగ్రస్ లోకి వస్తుంది.
Be first to comment on this News / Article!
|