వైఎస్ పై 'ప్రజా ప్రస్థానం'
స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి జీవిత విశేషాలతో 'రాజశేఖర రెడ్డి' అనే చిత్రాన్ని హీరో రాజశేఖర్ ప్రకటించారు. వైఎస్ పాత్రను రాజశేఖర్ పోషించనున్న ఈ చిత్రాన్ని వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ స్వీయదర్శకత్వంలో రూపొందించనున్నారు. త్వరలోనే పూరీ-జీవితా రాజశేఖర్ కలిసి వైఎస్ సన్నిహితుల వద్ద తగిన సమాచారం సేకరించి స్క్రిప్టు రెడీ చేయబోతున్నారు. ఇందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఆ తర్వాతే ఈ చిత్రం సెట్స్ పైకి వస్తుంది. అయితే దీనికంటే ముందుగా వైఎస్ జీవిత చిరిత్ర ఆధారంగా 'మహాప్రస్థానం' అనే మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని శ్రీ అమ్మ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రమేష్ నిర్మించనున్నారు. పి.సి.ఆదిత్య దర్శకుడు.
జనం హృదయంలో చెరగని ముద్ర వేసుకున్న వై.ఎస్. జీవిత విశేషాలతో ఈ చిత్రం రూపొందనుందనీ, వైఎస్. ఏ పని చేపట్టినా సెంటిమెంట్ గా చేవెళ్ల నుంచే ప్రారంభించేవారనీ, తాము సైతం చేవెళ్లలోనే షూటింగ్ ప్రారంభిస్తామనీ రమేష్ తెలిపారు. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకూ 1400 కిలోమీటర్లు వైఎస్ చేసిన పాదయాత్ర నుంచి ఆయన రాజకీయ జీవితం వరకూ ఈ చిత్రంలో ఉంటాయనీ చెప్పారు. వైఎస్ పాత్రను ఆయన పోలికలు ఉన్న పిడుగురాళ్లకు చెందిన జానీభాషా పోషించున్నారనీ, ఈనెల 21 నుంచి షూటింగ్ మొదలవుతుందనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|