కల్యాణ్ రామ్ 'జయీభవ'
'అతనొక్కడే', 'హరేరామ్' వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రానికి 'జయీభవ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా నరేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కల్యాణ్ రామ్ కు జోడిగా హన్సిక నటిస్తోంది.
ఈ చిత్రంలో తాను ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నాననీ, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామనీ కల్యాణ్ రామ్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం తప్పని సరిగా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిందనీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందనీ తెలిపారు. ఈనెలాఖరులో ఆడియో, అక్టోబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్ధి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, వేణుమాధవ్, చలపతిరావు, బెనర్జీ, సుధ, హేమ తదితరులు నటిస్తున్నారు. బివిఎస్ రవి కథ-మాటలు, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, రాజీవ్ నాయర్ ఆర్ట్, గౌతంరాజు ఎడిటింగ్, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|