మనోతేజ్ హీరోగా 'బబ్లూ'
మనోతేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎస్.పి.జె. క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి గూడురు ఝాన్సిరాణి నిర్మిస్తున్న చిత్రం 'బబ్లూ'. జి.రవిచరణ్ రెడ్డి ('కాళిదాసు' ఫేమ్) దర్శకుడు. హిమాయత్ సాగర్ వద్ద షూటింగ్ ప్రోగ్రస్ లో ఉంది. శనివారంనాడు షూటింగ్ స్పాట్ లోనే తొలిసారి ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది. మనోతేజ్, కథానాయిక అదితిశర్మ, రవిచరణ్, ముకుల్ దేవ్, కనల్ కణ్ణన్, నటులు శివాజీరాజా, రావు రమేష్, చిత్ర సమర్పకుడు గూడురు శివరామకృష్ణ పాల్గొన్నారు.
'కాళిదాసు' చిత్రం తర్వాత తాను చేస్తున్న రెండో చిత్రమిదని దర్శకుడు రవిచరణ్ రెడ్డి తెలిపారు. హీరోకు ఇది తొలి సినిమా అయినప్పటికీ అనుభవమున్న నటుడిలా చేస్తున్నాడనీ, నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా తీస్తున్నారనీ చెప్పారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనన్నారు. శివరామకృష్ణ మాట్లాడుతూ, ఈరోజు మనోతేజ్ పుట్టినరోజు కూడా కావడంతో సినిమా పబ్లిసిటీ మొదలుపెట్టామనీ చెప్పారు. ఇంతవరకూ 90 శాతం షూటింగ్ పూర్తయిందనీ, ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందనీ తెలిపారు. అక్టోబర్ మొదటివారంలో ఆడియో, చివరి వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇందులో హీరో అన్నగా తాను నటిస్తున్నట్టు రావు రమేష్ తెలిపారు. మనోతేజ్ సినిమాను ఎంతో ప్రేమించి పనిచేస్తున్నాడనీ, అతనికి జన్మదిన శుభాకాంక్షలనీ అన్నారు. చక్కటి కథాంశంతో ఎక్కడా ఖర్చుకు రాజీపడకుండా ఈ చిత్రం రూపొందుతోందని శివాజీరాజా పేర్కొన్నారు. మనోతేజ్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి తనకు సినిమా అంటే చాలా ఇష్టమనీ, తన తండ్రి నిర్మిస్తున్న చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతుండటం సంతోషంగా ఉందనీ అన్నారు. ఈ చిత్రంలో స్టూడెంట్ గా తాను నటిస్తున్నాననీ, సీనియర్ నటులంతా ఎంతో సహకరిస్తున్నారనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ముకుల్ దేవ్, ఆహుతి ప్రసాద్, వినోద్ కుమార్, రఘుబాబు, కృష్ణ భగవాన్, ఆలీ, వేణుమాధవ్, సురేఖా వాణి, మోనాలిసా, గీతాసింగ్ తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం రవిచరణ్ రెడ్డి అందిస్తున్న ఈ చిత్రానికి అఖిలన్ సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|