నిఖిల్-శ్వేతబసు రొమాన్స్
'హ్యాపీడేస్', 'యువత' చిత్రాలతో నిఖిల్, 'కొత్తబంగారులోకం', 'రైడ్' చిత్రాలతో శ్వేతబసు ప్రసాద్ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా సాయికృష్ణా ప్రొడక్షన్స్ పతాకంపై ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది. శ్రీధనలక్ష్మి ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సురేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతోంది.
చిత్ర విశేషాలను నిర్మాతలు దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఎం.చంద్రశేఖర్ వివరిస్తూ, ఇటీవల రాజమండ్రిలో ఏకథాటిగా నెలరోజుల పాటు షూటింగ్ జరిపామనీ, పక్షం రోజులుగా హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుతున్నామనీ తెలిపారు. మూడు పాటలు, రెండు రోజుల వర్క్ మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, మ్యూజికల్ గా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందనీ తెలిపారు. హ్యాపీడేస్, యువత చిత్రాల తర్వాత నిఖిల్ కు ఇంది మంచిపేరు తెచ్చే చిత్రమవుతుందనీ, శ్వేతబసు కెరీర్ కు కూడా ఇదో మంచి చిత్రమవుతుందనీ సహనిర్మాతలు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 15 కల్లా షూటింగ్ పూర్తి చేసి నవంబర్ నెలాఖరులో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అజయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆలీ, ధర్మవరపు, రఘుబాబు, వేణుమాధవ్, ఆహుతి ప్రసాద్, కాశీవిశ్వనాథ్, సత్తెన్న తదితరులు నటిస్తున్నారు. చందు మాటలు, బాలమురుగన్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, అనిల్ ('గమ్యం' ఫేమ్) సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|