నాగచైతన్య సరసన సమంత
అక్కినేని ఫ్యామీలీ మూడోతరం వారసుడుగా 'జోష్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ఇప్పుడు తన రెండో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందిరా ప్రొడక్ష్స్ బ్యానర్ పై మహేష్ సోదరి మంజుల, సంజయ్ సర్వూప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెన్నైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో ప్రస్తుతం షూటింగ్ ప్రోగ్రస్ జరుగుతోంది. నాగచైతన్య తొలిచిత్రం ద్వారా సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక తెలుగుతెరకు పరిచయం కాగా, రెండో చిత్రంలో నాగచైతన్యకు జోడిగా సమంత అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు.
యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. నాగచైతన్య డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నారు. సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉండటంతో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హైద్రాబాద్, చెన్నై, కేరళ, న్యూయార్క్ లలో షూటింగ్ జరుగనుంది. ఇదే చిత్రం తమిళంలో శింబు, త్రిష జంటగా 'విన్నతాండి వరువాయి' పేరుతో గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. రెండు వెర్షన్లు ఏకకాలంలో డిసెంబర్ లో విడుదల కానున్నాయి.
Be first to comment on this News / Article!
|