'సింహా' స్వైరవిహారం
'మిత్రుడు' చిత్రం తర్వాత యువరత్న బాలకృష్ణ కథానాయకుడుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న 'సింహా' చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. 'తులసి', 'భద్ర' వంటి హిట్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకుడు. బాలకృష్ణ సరసన స్నేహ ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో తొలి షెడ్యూల్ జరుపుకొన్న ఈ చిత్రం సోమవారం నుంచి హైద్రాబాద్ సిటీలో మరో షెడ్యూల్ జరుపుకొంటోంది.
పరుచూరి కిరీటి ఆ విశేషాలను తెలియజేస్తూ, ఈనెల 4 నుంచి 19వ తేదీ వరకూ రామోజీ ఫిలింసిటీలో కీలక షెడ్యూల్ జరిపామని తెలిపారు. ఇందులో భాగంగా బాలకృష్ణ ఇంట్రడక్షన్ ఫైట్, బాలకృష్ణ-స్నేహ ఉల్లాల్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించామని చెప్పారు. 21 నుంచి ప్రారంభమైన షెడ్యూల్ నవంబర్ నెలాఖరు వరకూ ఏకధాటిగా జరుగుతుందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.మహేంద్రబాబు మాట్లాడుతూ, డిసెంబర్ లో వైజాగ్ లో జరిపే షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ, 2010 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘు, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్, కె.ఆర్.విజయ, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆలీ, ధర్మవరపు, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం, ఝాన్సీ, సన, సైరాబాను, వినోద్, ప్రముఖ మలయాళ విలన్ సాయికుమార్ నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం బోయపాటి శ్రీను అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్దర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ఎ.ఎస్.ప్రకాష్ కళాదర్శకత్వం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
|