'ఆర్య-2' ఫస్ట్ లుక్...
'ఫీల్ మై లవ్ అంటూ' అల్లు అర్జన్ కు కొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టిన 'ఆర్య' చిత్రం ఇప్పుడు సీక్వెల్ రూపంలో 'ఆర్య 2' పేరుతో అక్టోబర్ మొదటివారంలో విడుదలకు సిద్ధమవుతోంది. తొలి వెర్షన్ కు దర్శకత్వం వహించిన సుకుమార్ దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందుతుండటం, 'పరుగు' సక్సెస్ తర్వాత బన్నీ నటించిన చిత్రం ఏదీ ఇంతవరకూ ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో సహజంగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై ఆదిత్యబాబు, భోగవల్లి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంచనాలున్న సినిమాలకు లీకేజ్ లు సహజమే అన్నట్టుగా తాజాగా 'ఆర్య-2' పోస్టర్ పిక్చర్లు లోగోతో సహా ఇంటర్నెట్ కు లీక్ అయ్యాయి.
'ఆర్య-2' చిత్రంలోని 'రింగా రింగా..', 'టిప్పు టాపు దొర కదిలిండో' అనే రెండు పాటలు ఆమధ్య లీక్ అయ్యాయి. తాజాగా లీకైన లోగోతో కూడిన పోస్టర్లలో అల్లు అర్జున్ స్టయిలిష్ గా అందర్నీ ఆకట్టుకునే గెటప్ లో కనిపిస్తున్నారు. టైటిల్ కు కింద 'మై లవ్ ఈజ్ గాన్' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇందులో అల్లు అర్జున్ తొలిసారి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను పోషిస్తుండగా, ఆయనకు జోడిగా కాజల్ నటిస్తుండటం కూడా ఇదే మొదటిసారి. మరో జంటగా నవదీప్-శ్రద్ధాదాస్, విలన్ గా తమిళ హీరో ఆర్యన్ నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆడియో వచ్చే వారంలో విడుదల కానుంది. ఈచిత్రానికి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|