తుషార్ తో 'మహాత్మ' ఆడియో
తుషార్ గాంధీ మాట్లాడుతూ, సామాన్యుడికి కూడా అర్ధమయ్యే రీతిలో మహాత్మ గాంధీ సిద్ధాంతాలను తెలియజెప్పే ఈతరహా చిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మనిషిలో మంచి తనం ఏ మాత్రం ఉన్నా చెడును తరిమికొట్టేందుకు అది ఉపకరిస్తుందనే సిద్ధాంతాన్ని బాపు ఎప్పుడూ నమ్మేవారని తెలిపారు. ఈ సినిమా ద్వారా బాపు సందేశాన్ని జనాల్లోకి పంపుతున్న చిత్రయూనిట్ కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉందనీ, పీపుల్స్ ఎన్ కౌంటర్ చిత్రం ద్వారా రామోజీ రావు తనను ప్రోత్సహిస్తే, వన్ బై టు చిత్రం ద్వారా తమ్మారెడ్డి భరద్వాజ తనను హీరోను చేశారనీ, తాజ్ మహల్ తో రామానాయుడు గారు తనకు హిట్ ఇచ్చారనీ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఇవివి వంటి దర్శకులు తనకు హీరోగా అవకాశాలిచ్చారనీ శ్రీకాంత్ పేర్కొన్నారు. తన జర్నీలో సహకరించిన అందరికీ తన కృతజ్ఞతలని అన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో మహాత్మ చిత్రంలో నటించడం ఎంతో గర్వంగా ఉందనీ, సినిమా క్రెడిట్ కృష్ణవంశీ కే దక్కుతుందనీ అన్నారు. తన మిత్రుడు మనోహర్ ఖర్చుకు రాజీపడకుండా సినిమా తీశారనీ అన్నారు. శ్రీకాంత్ పదిహేడేళ్లుగా తనకు మంచి మిత్రుడనీ, 'మహాత్మ' చిత్రం ఒక మరపురాని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాననీ కృష్ణవంశీ పేర్కొన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2
|