'సారాయి వీర్రాజు' పాటలు
అజయ్ హీరోగా విశాలాక్షి క్రియేషన్స్ బ్యానర్ పై పి.ఆర్.కె.రావు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'సారాయి వీర్రాజు'. రాజమౌళి శిష్యుడు డి.ఎస్.కణ్ణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీసాయి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ఎస్.ఎస్.రాజమౌళి ఆడియో సీడిని ఆవిష్కరించారు. భోగవల్లి ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, క్రిష్, గుణ్ణం గంగరాజు, మెహర్ రమేష్, శివబాలాజీ, శ్రీసాయి, అజయ్, కణ్ణన్, పిఆర్ కె రావు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ, ఇది తన సొంత సొనిమా మ్యూజిక్ ఫంక్షన్ వంటిదనీ, దర్శకుడు కణ్ణన్ కు అద్భుతమైన విజువల్ సెన్స్, మంచి సంగీతాభిరుచి ఉందన్నారు. ఈ చిత్రానికి శ్రీసాయి మంచి మ్యూజిక్ ఇచ్చారనీ, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. క్రిష్ మాట్లాడుతూ, కణ్ణన్ తాను తీసిన 'గమ్యం' సినిమాకి స్క్రిప్టు సైడు పనిచేశారనీ, 'సారాయి వీర్రాజు' చిత్రంలో 'నీదో నాదో' పాట తనకు బాగా నచ్చిందనీ చెప్పారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ, 'బిల్లా' సినిమా విషయంలో కణ్ణన్ తనకు సహకరించారనీ, ఎన్టీఆర్ తో తాను చేస్తున్న తదుపరి చిత్రానికి కూడా స్క్రిప్టు సైడు ఆయన పనిచేశారనీ అన్నారు. మంచి ప్రతిభావంతుడైన కణ్ణన్ దర్శకుడిగా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. నిర్మాతగా తనకిది తొలి సినిమా అనీ, దర్శకుడు చక్కటి సహకారం అందించారనీ పిఆర్ కె రావు అన్నారు. అభిరుచి గల నిర్మాతలు ముందుకు వస్తే మంచి సినిమాలు వస్తాయనీ, ఈ సినిమాకి అంతా కష్టపడి పనిచేశామనీ, శ్రీసాయి మంచి మ్యూజిక్ ఇచ్చారనీ కణ్ణన్ తెలిపారు. ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన తాను హీరోగా చేస్తున్న సినిమా ఇదనీ, నెలాఖరుకు సినిమా రీలీజ్ అవుతుందనీ అజయ్ తెలిపారు.
Be first to comment on this News / Article!
|