విదేశాల్లో ప్రభాస్ చక్కర్లు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు విదేశాల్లోనే చక్కర్లు కొడుతున్నారు. 'బిల్లా' సాధించిన సక్సెస్ ఇందుకు ప్రేరణ కావచ్చు. ఆ చిత్రం మలేసియాలోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకొంది. సహజంగా కథ డిమాండ్ ను బట్టి కూడా లొకేషన్ల ఎంపిక ఉంటుంది. ఇవాల్టి ట్రెండ్ లో ప్రేక్షకులను ఒప్పించడమంటే రిచ్ లొకేషన్లు, టెక్నికల్ క్వాలిటీనే ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా నమ్ముతున్నారు. ప్రభాస్ ఈమధ్యనే 'ఏక్ నిరంజన్' కోసం ఇటీవలే థాయ్ లాండ్ వెళ్లి వచ్చారు. అక్కడ ఓ కీలకమైన షెడ్యూల్ ను దర్శకుడు పూరీ జగన్నాథ్ చిత్రీకరించారు. తాజాగా ప్రభాస్ మరోసారి ఫ్లయిట్ ఎక్కుతున్నారు. ఈసారి ఆయన స్విట్జర్లాండ్ వెళ్తున్నారు. కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న 'డార్లింగ్' చిత్రం తొలి షెడ్యూల్ స్విట్జర్లాండ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ తో 'ఛత్రపతి' వంటి సంచలన హిట్ చిత్రాన్ని అందించిన భోగవల్లి ప్రసాద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
రొమాంటింక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించబోతున్నారనీ, ప్రభాస్ ను ఇందులో వైవిధ్యంగా చూపించబోతున్నారనీ సమాచారం. ఈ చిత్రం కోసం ఈనెల 26 నుంచి స్విట్జర్లాండ్ తొలి షెడ్యూల్ ప్లాన్ చేశారు. స్విస్ లోని అందమైన లొకేషన్లలో 35 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది. ప్రభాస్ కు జోడిగా తొలిసారి కాజల్ నటించనుంది.
Be first to comment on this News / Article!
|