సమద్ర డైరెక్షన్ లో అనుష్క
నాగార్జున మేకప్ మన్ చంద్ర నిర్మాతగా మారుతూ సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై ఓ కొత్త చిత్రాన్ని తలబెట్టారు. ఈ చిత్రంలో కథానాయికగా అనుష్క నటించనుంది. 'అరుంధతి' చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. ఈ చిత్రానికి వి.సముద్ర దర్శకుడిగా ఎంపికైనట్టు తాజా సమాచారం.
నాగార్జునకు చాలాకాలంగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న చంద్ర ఆయనతో పనిచేసిన 'సూపర్' చిత్రంతోనే అనుష్క తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే నాగార్జునతో పనిచేసిన 'సీతారామరాజు', 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలకు ఉత్తమ మేకప్ మన్ గా కూడా నంది అవార్డులను చంద్ర అందుకున్నారు. ఇటీవలే ఆయన నిర్మాతగా మారి ఓ కథతో అనుష్కను సంప్రదించడం, కథ నచ్చడంతో అనుష్క వెంటనే ఆ ఆఫర్ అందిపుచ్చుకోవడం జరిగింది. దీనికి దర్శకుడుగా సముద్ర పనిచేయబోతున్నారు. 'సింహరాశి', 'శివరామరాజు', 'ఎవడైతే నాకేంటి', 'మల్లెపూవు' వంటి పలు చిత్రాలకు సముద్ర దర్శకత్వం వహించారు. తాజా చిత్రం డిసెంబర్ 11న ప్రారంభమై, 2010 ఫ్రిబ్రవరి నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. అనుష్క ప్రస్తుతం మహేష్ తో 'వరుడు', క్రిష్ దర్శకత్వంలో 'వేదం', తమిళంలో విజయ్ సరసన ఒక చిత్రం చేస్తోంది. గోపీచంద్ తో ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న చిత్రానికి కూడా కమిట్ అయింది.
Be first to comment on this News / Article!
|