25న 'ఏక్ నిరంజన్' ఆడియో
ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా పూరీ జగన్నాథ్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం 'ఏక్ నిరంజన్'. ఆదిత్య రామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యరామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈనెల 25న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ చేస్తున్నట్టు ఆదిత్యరామ్ తెలిపారు.
పూరీ జగన్నాథ్, మణిశర్మ కాంబినేషన్ లో మరో మ్యూజికల్ హిట్ గా ఈ చిత్రం నిలుస్తుందనీ, పాటలన్నీ ఎక్స్ టార్డినరీగా ఉంటాయనీ ఆయన తెలిపారు. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయనీ, నవరస భరితంగా పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని మలిచారనీ చెప్పారు. ప్రభాస్ నటన ప్రధాన హైలైట్ గా నిలుస్తుందనీ, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తొలిసారిగా ప్రేక్షకులకు పరిచయమవుతోందనీ అన్నారు. ఈ చిత్రం కోసం థాయ్ లాండ్ లో తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉంటాయన్నారు. అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూసూద్, ముకుల్ దేవ్, మకరన్ దేశ్ పాండే, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణుమాధవ్, తనికెళ్ల భరణి, పోశాని తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం పూరీ జగన్నాథ్ అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|