జెనీలియా 'కథ' కంప్లీట్
'బొమ్మరిల్లు' చిత్రంతో హాసినిగా యువ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయిన జెనీలియా ఈమధ్యనే 'శశిరేఖా పరిణయం' చిత్రంతో మరోసారి అందరి మనసులు దోచుకుంది. ప్రస్తుతం హిందీలో బిజిగా ఉన్నప్పటికీ తెలుగులో సెలక్టివ్ గా చిత్రాలు చేస్తోంది. తాజాగా ఆమె తెలుగులో నటిస్తున్న ప్రేమకథతో కూడిన థ్రిల్లర్ చిత్రం 'కథ'. అరుణ్ (తొలిపరిచయం) కథానాయకుడు. జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ రాగ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. హైద్రాబాద్ లోని షాద్ నగర్ లో ఉన్న మంత్ర హౌస్ లో హీరోహీరోయిన్లపై చివరి సన్నివేశాలను దర్శకుడు ఈరోజు చిత్రీకరించారు.
తమ సంస్థ నుంచి వచ్చిన గత చిత్రాల తరహాలోనే వైవిధ్యమైన ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమిదనీ, నేటితో షూటింగ్ పూర్తయిందనీ గుణ్ణం గంగరాజు తెలిపారు. జెనీలియా ఈ చిత్రంలో టీచర్ గా ప్రధాన భూమిక పోషిస్తోందని చెప్పారు. త్వరలోనే ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్ , రఘుబాబు, షఫి తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం శ్రీనివాస రాగ అందిస్తున్న ఈ చిత్రానికి గుణ్ణం గంగరాజు మాటలు, రవీందర్ ఆర్ట్ , ఆండ్రూ సినిమాటోగ్రఫీ, ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|