రామ్ ను మీట్ కావాలంటే...
పేరున్న హీరో హీరోయిన్లు తరచు మొబైల్ నెంబర్లు మార్చేస్తుంటారు. లేదంటే ముఖ్యమైన వాళ్లకు మాత్రమే ఆ నెంబర్లు అందుబాటులో ఉంచుతారు. దీంతో అభిమానులు నేరుగా వారితో తమ సలహాలు, సూచనలు షేర్ చేసుకోవడం అసాధ్యమవుతుంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు పలువురు నటీనటులు తమ పేరుతో సొంత బ్లాగ్స్ ఏర్పాటు చేసుకుని అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే ఇది ఇంకా టాలీవుడ్ లో అంతగా వాడుకలోకి రాలేదు. బాలీవుడ్ లో మాత్రం పెద్ద తారలందరికీ సొంత బ్లాగ్ లు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ మరింత విస్తరించి ఫేస్ బుక్, ఆర్కుట్, ట్విట్జర్, మైస్పేస్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు కూడా ఎక్కువయ్యాయి.తదనుగుణంగానే నెట్ వర్కింగ్ సైట్స్ లో తారల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ బెడద కూడా మొదలైంది. బాలీవుడ్ లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. తాజాగా మన టాలీవుడ్ హీరో రామ్ కూ ఈ ఇబ్బంది తప్పలేదట. ఫేస్ బుక్, ఆర్కు ట్ లలో రామ్ పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ కనిపిస్తుండటం ఆయన దృష్టికి వచ్చింది.
ఈ విషయాన్ని రామ్ ధ్రువీకరిస్తూ, తనకు సొంతంగా ఏ సైట్ లోనూ ప్రొఫైల్ లేదని తెలిపారు. హీరోరామ్ డాట్ కామ్ లో మాత్రం అభిమానులు తనతో ఇంటరాక్ట్ కావచ్చనీ, వారి సలహాలు, సూచనలు తీసుకోవడం తనకూ ఎంత హెల్ప్ ఫుల్ గా ఉంటుందనీ తెలిపారు. సో...అభిమానులు ఫేక్ ఫ్రొఫైల్స్ జోలికి వెళ్లకుండా సదరు డాట్ కామ్ లో ఆయన్ని మీట్ కావచ్చు.
Be first to comment on this News / Article!
|