తారకు తన్నులు తప్పవు..!
'చేసిన నిర్వాకం చాలు. ఇప్పటికైనా నా భర్త కు దూరంగా ఉండు. లేకుంటే గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది' అంటూ ప్రభుదేవా భార్య రామలత ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి నయనతారను హెచ్చరించినట్టు సమాచారం. ప్రముఖ కొరియాగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన ప్రభుదేవ, రామలత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దికాలంగా ప్రభుదేవా, నయనతార మధ్య ప్రేమాయణం నడుస్తోందనీ, ఈ ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారంటూ ఇటీవల పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇవన్నీ వదంతులు గానే నయనతార కొట్టిపారేసింది. అయితే ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించగా గత శుక్రవారం విడుదలైన హిందీ 'వాంటెడ్' చిత్రాన్ని ముంబై బాంద్రాలోని ఓ మల్టీప్లెక్స్ లో నయన-ప్రభుదేవా కలిసి చూడటం నేషనల్ మీడియా దృష్టిని సైతం ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే రామలత తాజా ఇంటర్వ్యూ వివరాలు కూడా బయటకు వచ్చాయి.
ప్రభుదేవా-నయతార ఎఫైర్ పట్ల రామలత తీవ్రంగా కలత చెందుతోంది. ప్రభుదేవా భవిష్యత్ ప్రణాళికల గురించి తనకు తెలియదనీ, ఒక భర్తగా, తమ పిల్లలు రిషి, అదితిలను ఆదరంగా చూసే తండ్రిగా ఇప్పటికీ తాను ఆయనను ఎంతో ప్రేమిస్తున్నానని ఆమె తెలిపారు. తాను నయనతారతో ఫోనులో మాట్లాడాడనీ, ప్రభుదేవాతో రిలేషన్ కు స్వస్తి చెప్పాలని కోరారనీ, అయితే ఆశించిన ఫలితం మాత్రం రాలేదనీ ఆమె వాపోయారు. అయితే ఈసారి నయనతార తన కంటపడితే ఆమెపై కలబడడానికి కూడా సంకోచించనని స్పష్టం చేసింది. అది ఎప్పుడైనా, ఎక్కడైనా కావచ్చని అన్నారు. పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా నయనతారతో రిలేషన్ కు స్వస్తి చెప్పాల్సిందిగా ప్రభుదేవాకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆమె అర్థించారు.
Be first to comment on this News / Article!
|