సారీ ఆయన ఇంట్లో ఉన్నాడు
రుతిక, భార్గవ్, గౌతమ్, సౌమ్య ప్రధాన పాత్రల్లో జ్యోతి ఫిలిం ఫ్యాక్టర్ బ్యానర్ పై శంకర్ నిర్మిస్తున్న చిత్రం 'సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు'. హరీష్ దర్శకుడు. హైద్రాబాద్ కాజాగూడలోని ఓ ఇంట్లో ఈ కొత్త చిత్రం షూటింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. రుతిక, గౌతమ్, భార్గవ్ లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి అశ్వనీకుమార్ క్లాప్ ఇవ్వగా, మారుతీకుమార్ స్విచ్చాన్ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ, ఇది ఓ మధ్య తరగతి అమ్మాయికి చెందిన కథాంశమనీ, ఆమె కనే కలలు, ఆ తర్వాత తలెత్తే పరిణామాలు ఈ చిత్రంలో చూపిస్తున్నామని అన్నారు. ఇందులో మధ్య తరగతి అమ్మాయిగా తాను నటిస్తున్నట్టు రుతిక తెలిపింది. ఇందులో ఓ ప్రధాన క్యారెక్టర్ పోషిస్తున్నట్టు గౌతమ్ పేర్కొనగా, కథ చాలా బాగుందనీ, తాను మంచి పాత్ర పోషిస్తున్నాననీ చెప్పారు. సంభాషణల రచయిత కె.ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ, పెళ్లి ముందు కానీ, తర్వాత కానీ కలలు కనడం సహజమనీ, పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు సజావుగా సంసారం సాగించాలనీ, చిన్న అల ఎదురైతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్నదే ఈ చిత్రకథ అనీ అన్నారు. క్లైమాక్స్ విభిన్నంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి కల్యాణ్ సినిమాటోగ్రఫీ, నరేష్ సంగీతం అదిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|