బాలల చిత్రం 'అంతే'
ఎస్.వి.క్రియేషన్స్ బ్యానర్ పై బాలల ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం 'అంతే'. విశ్వప్రసాద్ దర్శకత్వంలో కె.శివశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ భాస్కర్, నిషా (తొలి పరిచయం) హీరో హీరోయిన్లు. బాలనటి శ్రియ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో బుధవారం ఉదయం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి బి.సత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, అంకమరావు (ఎన్ఆర్ఐ) కెమెరా స్విచ్చాన్ చేశారు. సి.హెచ్.సుధాకర్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు.
ఇది బాలల చిత్రమనీ, పాప చుట్టూ తిరిగే కథాంశమనీ విశ్వప్రసాద్ తెలిపారు. పెద్దవాళ్లు తప్పులు చేస్తే పిల్లలు ఎలాంటి మానసిక సంఘర్షణ ఎదర్కొంటారనేది ఇందులో చెబుతున్నామని అన్నారు. ఓ మంచి కాన్సెప్ట్ తో సందేశాత్మకంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని నిర్మాత తెలిపారు. కథ తనదేననీ, పరిశ్రమతో తనకున్న అనుబంధంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాననీ చెప్పారు. ఇది స్పందించే చక్కటి కథాంశమని హీరో విజయ్ భాస్కర్ తెలిపారు. మోడలింగ్ రంగంలో ఉన్న తనకు ఇది తొలి సినిమా అని నిషా తెలిపింది. ఈచిత్రానికి వంశీ కృష్ణ సినిమాటోగ్రఫీ, అర్జున్ శర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|