యువతకు జన జాగృతి
జనజాగృతి క్రియేష్స్ బ్యానర్ పై జి.శ్రీనివాసరావు (యుఎస్ఎ) సమర్పణలో సి.పుండరీకం నిర్మిస్తున్న ఓ కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి సి.కుమార స్వామి దర్శకుడు. రవి, పవన్, రమణారెడ్డి, బెన్ హర్ శ్యాంసన్, సతీష్, సీలన్ జేవియర్, అవనీ జైన్ ప్రధాన తారాగణం. అన్నపూర్ణా స్టూడియోస్ బుధవారంనాడు ఈచిత్రం ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి చిగురుపల్లి రమేష్ క్లాప్ ఇవ్వగా, నోముల ప్రకాష్ స్విచ్చాన్ చేశారు. చంద్రమహేష్ గౌరవ దర్శకత్వం వహించారు.
యూత్ కు సందేశమిచ్చే చిత్రమిదని దర్శకుడు కుమార స్వామి తెలిపారు. నేటి యువత పెడదారి పడుతోందనీ, వారు సక్రమ మార్గంలో నడిస్తే ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించనున్నామనీ చెప్పారు. గతంలో పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన తనకు దర్శకుడిగా ఇది తొలి చిత్రమని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి 10 వరకు తొలి షెడ్యూల్ హైద్రాబాద్ లో జరుపుతామని, అదే నెలాఖరు నుంచి వికారాబాద్ ఫారెస్ట్ లో మరో షెడ్యూల్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి ఎస్.ఎన్.తిరు సినిమాటోగ్రఫీ, పవన్ సింగ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|