గెద్దాడ కుటుంబానికి సాయం
కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన దర్శక నిర్మాత గెద్దాడ ఆనందబాబు కుటుంబాన్ని ఆదుకునేందుకు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ముందుకు వచ్చారు. జె.వి.మోహన్ గౌడ్ అనే నిర్మాత 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గెద్దాడ కుటుంబరావు కుటుంబానికి బుధవారంనాడు అందజేశారు. హైద్రాబాద్ ఫిలిం ఛాంబర్ హాలులో బుధవారంనాడు జరిగిన కార్యక్రమంలో ఈ సహాయాన్ని అందజేశారు.
గెద్దాడ ఆనందబాబు కుటుంబానికి తాము చేతనైనంత సహాయం చేస్తామనీ, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామనీ నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలిపారు. గెద్దాడ కుమార్తె చదువుకు అయ్యే ఖర్చు భరిస్తానని దర్శకుడు రాజమౌళి ఓ సందేశం ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా గెద్దాడ కుటుంబ సభ్యులకు మోహన్ గౌడ్ తన సొంత సొమ్మునుంచి 50 వేల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో నటుడు-నిర్మాత అశోక్ కుమార్, ఫిలిమ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బాలకృష్ణారావు, బూరుగుపల్లి శివరామకృష్ణ, సాగర్, మోహన్ వడ్లపట్ల, సిఎన్ రావు, తుమ్మలపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|