శంషాబాద్ లో రెహ్మాన్ లైవ్
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహ్మాన్ 'జై హో' లైవ్ కన్సర్ట్ జంటనగర వాసులను అలరించనుంది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ జిఎంఆర్ ఎరీనాలో అక్టోబర్ 24న కన్నులపండువగా నిర్వహించనున్నారు. రెహ్మాన్ తో పాటు శివమణి, బల్జీ, చిత్ర, బెన్నీ డయల్, జావిద్ అలి, అస్లాం, రషీద్ అలీ, శ్వేతా పండింట్, నీటి మోహన్ వంటి పలువురు ప్రముఖ నేపథ్యగాయకులు, వాద్యకారులు ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. 50,000 మందికి పైగా సంగీత ప్రియులు ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు విజ్ క్రాప్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
టిక్కెట్ల్ బుకింగ్ వివరాల కోసం www.hyderabad.aero., ఈవెంట్ రిజిస్ట్రేషన్ వివరాల కోసం jaiho@wizcraftworld.com ను సంప్రదించవచ్చు.
Be first to comment on this News / Article!
|