విశాల్ పై నిర్మాత ఫిర్యాదు
తెలుగు కుర్రాడే అయినా తమిళంలో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విశాల్ పేరు తెచితే నిర్మాత సింగనమల రమేష్ గుర్రుమంటున్నారు. తనతో సినిమా చేస్తానని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకుని ముఖం చేటేశాడంటూ ఆయన ఆవేదన చెందుతున్నారు. సింగనమల రమేష్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో 'కొమురం పులి', మహేష్ తో 'కలేజా' (టైటిల్ ఖరారు కావాల్సి ఉంది) వంటి భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు. తమిళ 'పోకిరి' నిర్మించింది కూడా ఆయనే.
విశాల్ ఈ మధ్యనే 'పిస్తా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత సినిమా సింగనమల రమేష్ తో ద్విభాషా చిత్రం చేసేందుకు ఒప్పందం కూడా కూడా చేసుకున్నారట. ఇందుకు సంబంధించి కొంత అడ్వాన్స్ తీసుకుని తన సరసన శ్రియను ఎంపిక చేయమని చెప్పి ఆమెకు కూడా అడ్వాన్స్ ఇప్పించారట. అయితే ఇప్పడు ఆ చిత్రాన్ని విశాల్ సోదరుడు, నిర్మాత విక్రమ్ కృష్ణ తన చేతిలోకి తీసుకుని నిర్మాణం కూడా మొదలుపెట్టేశారు. విశాల్ తీసుకున్న అడ్వాన్స్ సొమ్ము తిరిగి ఇవ్వలేదంటూ ఇప్పుడు సింగనమల రమేష్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. శ్రియకు ఇప్పించిన అడ్వాన్స్ కూడా తనకు విశాల్ ఇప్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నేను తెలుగువాడినే నంటూ తరచు చెప్పే విశాల్ మరి తెలుగు నిర్మాతతో తగాదా పడకుండా సామరస్యపూర్వక పరిష్కారం ఎంచుకుంటే శ్రేయస్కరం.
Be first to comment on this News / Article!
|