'శ్రీమతి కల్యాణం' సాంగ్స్
వడ్డే నవీన్, సంగీత హీరోహీరోయిన్లుగా గోయింగ్ మూవీ క్రియేష్స్ బ్యానర్ పై శివాల్ దర్శత్వంలో భానుకిరణ్ నిర్మిస్తున్న చిత్రం 'శ్రీమతి కల్యాణం'. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఆడియో సీడీని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించి తొలి ప్రతిని కోడి రామకృష్ణకు అందజేశారు. సినిమా ట్రైలర్స్ ను కోడిరామకృష్ణ విడుదల చేశారు. బాలకృష్ణారావు, కెవివి సత్యనారాయణ, భానుకిరణ్, వడ్డే నవీన్, సంగీత, వెంకట్, భీమినేని శ్రీనివాసరావు, సాయికార్తీక్, హేమ, విజయరంగరాజు, దువ్వాసి తదితరులు పాల్గొన్నారు.
సినిమా అంటే ఎంతో కొంత సందేశం ఉంటుందనీ, ఇందులోనూ అలాంటి సందేశం ఉండి మంచి సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాననీ జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మంచి టైటిల్, టైటిల్ కు తగిన పాత్రధారులతో సినిమా ఉంటుందనీ, పాటలు, సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాననీ కోడిరామకృష్ణ అన్నారు. ఇందులోని పాటలు యువతరంతో పాటు మహిళలను కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయనీ, శోభన్ బాబు, జగపతిబాబు తరహా హీరో వడ్డే నవీన్ అనీ కెవివి సత్యనారాయణ అన్నారు. ఈ సినిమాలో మంచి పాత్ర పోషించినట్టు జి.వి.నారాయణరావు తెలిపారు. ఇందులో ఏడు పాటలు ఉన్నాయనీ, ఆడియో తో పాటు సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాననీ సాయి కార్తీక్ అన్నారు. 'పెళ్లి' తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ సాధిస్తుందనే ఆశాభావాన్ని హీరో వడ్డే నవీన్ వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|