'ఏక్ నిరంజన్' ఆడియో
ప్రభాస్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఏక్ నిరంజన్'. పూరీ జగన్నాథ్ సమర్పణలో ఆదిత్య రామ్ మూవీస్ పతాకంపై ఆదిత్య రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మాదాపూర్ లోని శిల్పకలా వేదికపై శుక్రవారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మధు యాష్కి ఆడియో క్యాసెట్లను ఆవిష్కరించి తొలి ప్రతిని కంగనా రనౌత్ కు అందజేశారు. ఆడియో సీడీని కె.రాఘువేంద్రరావు ఆవిష్కరించి అల్లు అర్జున్ కు అందజేశారు. ఆదిత్యరామ్, పూరీ జగన్, సురేష్ బాబు, జెమినీ కిరణ్, కె.ఎల్.నారాయణ, శేఖర్ బాబు, అశోక్ కుమార్, సి.కల్యాణ్, సాగర్, బివిఎస్ ఎన్ ప్రసాద్, దిల్ రాజు, అల్లు అర్జున్, ప్రభాస్, కంగనా రనౌత్, ఆలీ, భాస్కరభట్ల, శ్యామ్ కె నాయుడు తదితరులు పాల్గొన్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది.
మధుయాష్కి మాట్లాడుతూ, పాటలు బాగున్నాయనీ, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో కలిసి తాను చేసిన కామెడీ అందర్నీ ఆకట్టుకుంటుందనీ, సరికొత్త ప్రభాస్ ను ఇందులో చూస్తారనీ ఆలీ పేర్కొన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ, మణిశర్మ తన 'బిల్లా' చిత్రానికి మంచి సంగీతం అందించినట్టే ఈ సినిమాకి కూడా చక్కటి సంగీతం అందించారనీ అన్నారు. తన అభిమానులకు నచ్చేలా డార్సింగ్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తీశారని అన్నారు. మధు యాష్కి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు తన కృతజ్ఞతలని పూరీ జగన్నాథ్ అన్నారు. ఆదిత్య రామ్ తనకో హిట్ చిత్రం ఇవ్వమని అన్నారనీ, ప్రభాస్ నటనలో ఇరగదీశాడనీ, కామెడీ ట్రాక్ మంచి వినోదం పంచుతుందనీ చెప్పారు. మణిశర్మతో తనకిది మూడో సినిమా అనీ, ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాననీ అన్నారు. ఆదిత్య రామ్ మాట్లాడుతూ, సినిమాలో ప్రభాస్ నటన హైలైట్ అనీ, పూరీ జగన్నాథ్ ఏకాగ్రతతో కష్టపడి సినిమా చేశారనీ అన్నారు. అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.
Be first to comment on this News / Article!
|