పూరీ జగన్నాథ్ క్యాంప్ లో ఇప్పుడు కుంచె రఘు వచ్చి చేశారు. గాయకుడుగా కుంచె రఘు అందరికీ సుపరిచితుడే. ఇటీవల సొంత మ్యూజిక్స్ ఆల్బమ్స్ కూడా చేశారు. పూరీ జగన్నాథ్ గత చిత్రాల్లో కుంచె రఘు నేపథ్యగానం అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పూరీ తదుపరి చిత్రానికి సంగీత దర్శకుడి ఆఫర్ ను కూడా రఘు దక్కించుకున్నారు.
రఘు ప్రస్తుతం 'బంపర్ ఆఫర్' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పూరీ నిర్మాత కూడా. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై ఇన్ స్టంట్ హిట్ గా డిక్లేర్ అయింది దీంతో పూరీ జగన్నాథ్ ఆయనకు తన 'గోలీమార్' చిత్రానికి సంగీత దర్శకుడి అవకాశం ఇచ్చారు. ఈ చిత్రాన్ని పూరీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా త్వరలోనే సెట్స్ కు తీసుకు రానున్నారు. పూరీ జగన్నాథ్ గత చిత్రాలకు చక్రి ఎక్కువగా సంగీతం అందించేవారు. ఇటీవల కాలంలో ఈ కాంబినేషన్ కు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు చక్రికి బదులుగా పూరీ క్యాంప్ లో రఘు వచ్చి చేశారు. 'గోలీమార్' సాంగ్స్ ఏమాత్రం జనాలకు పట్టినా రఘు కుంచె సంగీత దర్శకుడుగా బిజీ కావడం ఖాయం.