సోనీ బిఎంజికి 'ఆర్య-2'
బాలీవుడ్ నుంచి ఇటీవలే టాలీవుడ్ మ్యూజిక్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన సోనీ బిఎంజి మరో ప్రిస్టేజియస్ ఆల్బమ్ ను దక్కించుకుంది. అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఆర్య-2' (బేబీ హి లవ్స్ యు) చిత్రం మ్యూజిక్ రైట్స్ ను సోనీ బిఎంజి సొంతం చేసుకుంది. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్యబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెలాఖరులో ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. తొలిసారి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అతనికి జోడిగా కాజల్, మరో జంటగా నవదీప్, శ్రద్ధాదాస్ నటించారు. తమిళ హీరో ఆర్య ఇందులో విలన్ గా నటించారు. ఈ చిత్రంలోని రెండు పాటలు (రింగా రింగా...టిప్పు టాపు దొర కదిలిందో) ఇప్పటికీ నెట్ కు లీక్ కావడంతో పాటు మంచి రెస్పాన్ కూడా రావడంతో ఆడియోపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|