హన్సికకు 2 కోట్లు...
'దేశముదురు', 'కంత్రీ', 'మస్కా', 'బిల్లా' (గెస్ట్ రోల్) చిత్రాలలో టాలీవుడ్ లో పాగా వేసిన హన్సిక మోత్వాని ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్ట్ లతో కూడా బిజీగా ఉంది. పనిలో పనిగా హిందీలోనూ ఓ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. 'ఆప్ కా సరూప్' గాళ్ గా హిందీలోనూ తన సత్తా చాటుకున్న హన్సిక తాజాగా 'మై ఔర్ మేరా హిమ్మత్' అనే హిందీ చిత్రానికి కమిట్ అయింది. ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది. ఆసక్తకరంగా ఈ చిత్రంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు జోడిగా హన్సిక నటిస్తోంది.
షోయబ్ అక్తర్ ను అప్పట్లో 'గాంగ్ స్టర్' చిత్రంలో షైనీ అహుజా పాత్ర కోసం సంప్రదించినప్పటికీ అది ఎందుకో సాధ్యపడలేదు. 'మై ఔర్ ఇమ్మత్' చిత్రానికి సంఘమిత్ర చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హన్సిక అమాయకంగా కనిపించే గ్రామీణ అమ్మాయి పాత్రలో నటించనుందని తెలుస్తోంది. పంజాబీ అమ్మాయిగా హన్సిక కనిపించనుండటం కూడా ఇదే ప్రథమం. ఈ చిత్ర ఇతివృత్తం ప్రకారం కథానాయకుడు పాక్ క్రికెటర్. ఇండియాలో పర్యటించినప్పుడు ఓ ఇండియన్ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమకథ ఎలా సుఖాంతమైందనేది రొమాంటిక్ క్యూట్ లవ్ స్టోరీగా దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. హన్సిక కోసం నిర్మాతలు ఆరు నెలలుగా ప్రయత్నాలు చేసి ఒప్పించరానీ, రెమ్యునరేషన్ గా 2 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారనీ తెలుస్తోంది. తెలుగులో కోటి రూపాయల రేంజ్ కు ఇద్దరూ ముగ్గురు తారలే చేరిన తరుణంలో హన్సిక బాలీవుడ్ లో 2 కోట్లకు చేరుకోవడం విశేషమనే చెప్పాలి. జెనీలియా సైతం ఇప్పుడు అంతే మొత్తాన్ని హిందీలో తీసుకుంటూ తెలుగులోనూ అంతే మొత్తాన్ని ఆశిస్తోందట. అన్నట్టు...హన్సిక ఇప్పుడు కల్యాణ్ రామ్ సరసన 'జయీభవ' చిత్రంలోనూ, నితిన్ తో మరో చిత్రంలోనూ నటిస్తోంది.
Be first to comment on this News / Article!
|